కన్నడ స్టార్ యష్ ‘కేజీఎఫ్’ తర్వాత లుక్ పరంగా ఎలాంటి ఛేంజ్ లేకుండానే ఇంతవరకూ కనిపించాడు. అదే గుబురు గెడ్డం…లాంగ్ హెయిర్ స్టైల్ లో కనిపించాడు. అవసరం మేర అప్పుడప్పుడు పోని టెయిల్ లోకి ట్రాన్సపర్ అయ్యేవాడు. అంతకు మించి బయట కొత్త లుక్ లో కనిపించింది లేదు. కేజీఎఫ్ రిలీజ్ అయినా అలాగే కనిపించడంపై రకరకాల సందేహాలు తెరపైకి వచ్చాయి.
తదుపరి సినిమా టాక్సిక్ లోనూ అలాగే కనిపిస్తాడా? అందుకే అదే పాత లుక్ మెయింటెన్ చేస్తున్నాడా? అని అభిమానులంతా అంచనా వేసారు. కానీ అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ టాక్సిక్ లో యష్ న్యూ హెయిర్ స్టైల్ లో కనిపిస్తాడని నేటి తో క్లారిటీ వచ్చేసింది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న ‘టాక్సిక్’ సినిమా నుంచి యష్ లుక్ రివీల్ చేయలేదు. అతడి లుక్ ఎలా ఉంటుందని అభిమానులు ఊహకే వదిలేసారు.
తాజాగా ఆ లుక్ లీకైంది. యష్ ని న్యూ హెయిర్ స్టైల్ లో అదరగొడుతున్నాడు. కోంబ్ ఓవర్ అండ్ ఫేడ్ లుక్ లో స్మార్ట్ గా ఉన్నాడు. లాంగ్ హెయిర్ తీసేసి..సైడ్స్ ని జీరో సైజ్ లో ట్రిమ్ చేసి…టాప్ లో ఒత్తుగా అర్చారు. అక్కడ నుంచి కిందకు రాగా మధ్యలో మళ్లీ జీరో ట్రిమ్ ఉంటుంది. ఆ కిందన బియర్డ్ హైలైట్ అవుతుంది. అతడిని ఇలా తయారు చేసింది ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అలెక్స్ విజయ్ కాంత్.
ఈ హెయిర్ స్టైల్ ని ఉద్దేశించి అతడు ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ‘ఇది నిజంగా బ్లాస్టింగ్ లుక్. రాకింగ్ స్టార్ యష్ కోసం కస్టమ్ పాంపడోర్. పాత్రకి సంబంధించి డిఫరెంట్ హెయిర్ లుక్ ట్రై చేయడం నాకెప్పుడు సవాల్ గానే అనిపిస్తుంది. ఈ లుక్ కోసం చాలాసేపు శ్రమించాల్సి వచ్చింద’న్నాడు. యశ్..అలెక్స్ ఉన్న ఫోటోని కూడా షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ పిక్ యశ్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. రేపటి నుంచి అభిమానుల్లో ఇదే ట్రెండ్ కనిపిస్తుంది.