గేమ్‌ ఛేంజర్ లో దిల్‌ రాజు ఫింగరింగ్ సాధ్యమేనా…?

మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్ ఆర్ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టగానే మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్క తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూడటం మొదలు పెట్టారు. వీరి కాంబోలో రాబోతున్న గేమ్‌ ఛేంజర్‌ కి గతంలో ఉన్నంత బజ్‌ ఇప్పుడు లేదు అనేది చాలా మంది అంటున్న విషయం.

ఆర్ఆర్‌ఆర్ సినిమాతో గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రామ్‌ చరణ్ తో కచ్చితంగా దర్శకుడు శంకర్ అద్భుతాన్ని ఆవిష్కరిస్తాడని ప్రతి ఒక్కరు భావించారు. కానీ శంకర్ దర్శకత్వంలో రూపొంది విడుదల అయిన ఇండియన్ 2 సినిమా ఫలితం తర్వాత గేమ్‌ ఛేంజర్ విషయంలో ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఈ మధ్య కాలంలో శంకర్‌ నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. చరణ్ మూవీ పరిస్థితి ఏంటో అనే ఆందోళన మెగా ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. ఈ సమయంలో వారు దిల్‌ రాజు ను సోషల్‌ మీడియా వేదికగా వేడుకుంటున్నారు. ఇప్పటికే దాదాపుగా షూటింగ్‌ పూర్తి అయ్యింది.

ఎడిటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమాను దిల్‌ రాజు కాస్త సీరియస్ గా తీసుకుని ఏమైనా తనకు తేడా అనిపించిన సీన్స్ ను రీ షూట్‌ చేయడం లేదంటే, ఎడిటింగ్‌ లో తన మార్క్ ఉండేలా చూడటం మంచిది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శంకర్ వంటి దిగ్గజ దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన సినిమా విషయంలో నిర్మాత వేలు పెట్టడం అనేది సాధ్యమేనా అంటే కచ్చితంగా కష్టం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నిర్మాత దిల్‌ రాజు అయినా కూడా శంకర్ వంటి పెద్ద దర్శకుడి సినిమా ను ఎడిటింగ్‌ దశలో మార్పులు చేయడం సాధ్యం అయ్యే విషయం కాదు.

కనుక ఈ సమయంలో దిల్‌ రాజు పై కూడా ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకోవడం అనేది వృధా ప్రయాస అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయినా ఇండియన్ 2 ను గేమ్‌ ఛేంజర్ ను పోల్చుతూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అనేది కొందరి అభిప్రాయం. మెగా ఫ్యామిలీ కథ మొత్తం విన్న తర్వాతే ఓకే చెప్పి ఉంటుంది.

మేకింగ్‌ సమయంలో కూడా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కనుక గేమ్‌ ఛేంజర్ మినిమం ఉంటుంది అనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి గేమ్‌ చేంజర్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే క్రిస్మస్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే.