ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నార్త్ ఇండియాలో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నారు. ఈ మూవీ ఏకంగా 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. నార్త్ ఇండియన్ ప్రేక్షకులకి పుష్ప రాజ్ క్యారెక్టర్ విపరీతంగా కనెక్ట్ అయిపొయింది. అలాగే సినిమాలోని సాంగ్స్ కూడా బీభత్సంగా ఎక్కేశాయి. దీంతో మూవీ మౌత్ టాక్ తోనే జనాల్లోకి వెళ్లి సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీకి సీక్వెల్ గా రాబోయే పుష్ప ది రూల్ కోసం నార్త్ ఇండియన్ ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.
కచ్చితంగా ఈ సినిమా నార్త్ లో భారీ కలెక్షన్స్ కొల్లగొడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీని తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారంట. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికి మూడు సినిమాలు వచ్చి హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నాయి. ఈ సారి పౌరాణిక కథాంశంతో త్రివిక్రమ్, అల్లు అర్జున్ తో మూవీ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బన్నీ మూవీ ఉంటుంది.
బాలీవుడ్ దర్శకులు కూడా అల్లు అర్జున్ తో మూవీస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ ని ఉపయోగించుకొని ఎస్టాబ్లిష్ కావాలని అనుకుంటున్నారు. చాలా మంది ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ అద్వానీ అల్లు అర్జున్ తో మూవీ చేయాలని కలిసాడంట. వారి మాటల మధ్యలో బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలని ఎలా చూపించాలో మరిచిపోయిందని బన్నీ తనతో అన్నట్లు నిఖిల్ అద్వానీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
అల్లు అర్జున్ తో మూవీ చేయడం గురించి నేను మాట్లాడుతుంటే అతను నాతో బాలీవుడ్ లో ఉన్న సమస్యని చెప్పాడని పేర్కొన్నారు. హీరోలు ఎలా ఉండాలో మీ ఇండస్ట్రీ మరిచిపోయింది అని తనతో అల్లు అర్జున్ అన్నారని నిఖిల్ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశారు. అయితే నిజంగా బన్నీ నిఖిల్ తో అలాంటి వ్యాఖ్యలు చేశాడా అనేది తెలియదు. కానీ బిటౌన్ లో అల్లు అర్జున్ కామెంట్స్ పైన ఇప్పుడు ఇంట్రస్టింగ్ చర్చ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది సౌత్ దర్శకులతో మూవీస్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
మాస్ అండ్ కమర్షియల్ యాక్షన్ కథలని చెప్పడంతో సౌత్ దర్శకులు సత్తా చూపిస్తున్నారు. షారుఖ్ ఖాన్ ఇప్పటికే అట్లీతో మూవీ చేసి సక్సెస్ అందుకున్నారు. సల్మాన్ ఖాన్ వరుసగా మూడు సినిమాలు సౌత్ దర్శకులతోనే చేయబోతున్నాడు. అమీర్ ఖాన్ కూడా సౌత్ కథలని రీమేక్ చేయాలని అనుకుంటున్నారు. అలాగే సౌత్ దర్శకులని సంప్రదిస్తున్నారంట. బాలీవుడ్ స్టార్స్ కి గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లు లేవు. వీటి బట్టి చూస్తుంటే బన్నీ వ్యాఖ్యల్లో వాస్తవం ఉందనే మాట బిటౌన్ లో వినిపిస్తోంది.