పవన్ కళ్యాణ్ ఒక వైపు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బిజీ బిజీగా ఉన్నా ఆయన సినిమాల్లో నటించాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఆయన నేటి నుంచి హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మంగళగిరిలోనే హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొంటున్నాడు. ఒక వైపు పరిపాలన పరమైన పనులతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ మరో వైపు రోజులో కొంత భాగంను షూటింగ్ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే వీరమల్లు షూటింగ్ పునః ప్రారంభం అయింది. అయితే ఫ్యాన్స్ మొత్తం ‘ఓజీ’ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సాహో సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమా చిత్రీకరణ దాదాపు సగానికి పైగా పూర్తి అయింది. సంగీత దర్శకుడు థమన్ ఇప్పటికే పాటల రికార్డింగ్ ప్రారంభించాడు. తాజాగా చెన్నై లో ఓజీ సినిమాలోని మొదటి పాటను రికార్డ్ చేయడం జరిగింది. దర్శకుడు సుజీత్ ఆధ్వర్యంలో తమిళ స్టార్ హీరో శింబు పాడిన పాటను థమన్ రికార్డ్ చేశాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. హీరో శింబు పాటలు పాడటం కొత్తేం కాదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆయన పాటం కచ్చితంగా స్పెషల్ అనడంలో సందేహం లేదు. అందుకే ఈ పాట యమ క్రేజీగా ఉండటం ఖాయం అనే నమ్మకంతో ఫ్యాన్స్ కనిపిస్తున్నారు.
ఓజీ కోసం పాట పాడిన హీరో శింబు మాత్రం పారితోషికం తీసుకోలేదు. తనకు ఇవ్వాలి అనుకున్న పారితోషికంను తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరదల వల్ల నష్టపోయిన వారికి సాయంగా నా వంతుగా ఇవ్వండి అంటూ శింబు నిర్మాతలతో అన్నాడట. ఓజీ సినిమా సినిమా చిత్రీకరణ పునః ప్రారంభం కోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు కచ్చితంగా ఇదో బిగ్ అప్డేట్ అనడంలో సందేహం లేదు. పాటల రికార్డింగ్ జరుగుతున్న కారణంగా త్వరలోనే సినిమా షూటింగ్ సైతం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంతో కనిపిస్తున్నారు.
ప్రభాస్ తో సాహో వంటి భారీ యాక్షన్ మూవీని రూపొందించిన దర్శకుడు సుజీత్ కి బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. కనుక ఓజీ సినిమా తో హిందీలోనూ సత్తా చాటాలని సుజీత్ భావిస్తున్నాడు. అందుకోసం పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఓజీ కోసం చాలా కష్టపడుతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఓజీ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. థమన్ అందించబోతున్న సంగీతం ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి మొదటి పాట వస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అధికారికంగా ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.