ఇళయదళపతి విజయ్ తో ‘ది గోట్’ మూవీ చేసిన వెంకట్ ప్రభు తమిళనాట కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నారు. ఈ మూవీ ఒక్క తమిళంలో తప్ప ఏ భాషలో కూడా హిట్ కాలేదు. అలాగే సినిమాకి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. వెంకట్ ప్రభు సినిమాలు అంటే బ్లాక్ బస్టర్ హిట్స్ ఉంటాయి. అలాగే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ కూడా కనిపిస్తాయి. ‘మానాడు’ సినిమా అతని దర్శకత్వం ప్రతిభని చూపిస్తుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు వెంకట్ ప్రభు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో మూవీ చేసే అవకాశం సొంతం చేసుకున్నారంట. రీసెంట్ గా రజినీకాంత్ కి అతను స్టోరీ లైన్ నేరేట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమా గురించి ఒక స్పష్టత రావొచ్చని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ‘2.ఓ’ నుంచి రీసెంట్ గా వచ్చిన ‘వేట్టయన్’ వరకు సూపర్ స్టార్ రజినీకాంత్ ఏకంగా నాలుగు సినిమాలు చేశారు.
ఈ నాలుగు కూడా కమర్షియల్ గా వారికి సక్సెస్ ఇవ్వలేదు. ‘వేట్టయన్’ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో లైకా వారికి పరిహారంగా మరో సినిమా చేయాలని రజినీకాంత్ అనుకుంటున్నారు. అయితే ఎవరితో చేస్తారనేది క్లారిటీ లేదు. ఇప్పుడు సడెన్ గా వెంకట్ ప్రభుతో మూవీ అంటూ న్యూస్ తెరపైకి వచ్చింది. ఒక వేళ అన్ని అనుకున్నట్లు సెట్ అయితే రజినీకాంత్ వచ్చే ఏడాది వెంకట్ ప్రభుతో సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది.
అయితే దళపతితో చేసిన ‘ది గోట్’ వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత వెంకట్ ప్రభు అనేసరికి సూపర్ స్టార్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ‘జైలర్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని రజినీకాంత్ నుంచి ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. వెంకట్ ప్రభు రజినీకాంత్ ఇమేజ్ కి సరిపోయే మూవీ చేయగలడా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ‘వేట్టయన్’ మూవీతో టీజే జ్ఞాన్ వేల్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు. దీంతో ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేస్తోన్న ‘కూలీ’ మూవీ పైన హోప్స్ పెట్టుకున్నారు.
ఈ సినిమా రజిని స్టామినాని మరోసారి ప్రూవ్ చేస్తుందని అంటున్నారు. నెక్స్ట్ ‘జైలర్ 2’ కూడా లైన్ లో ఉంది. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ కాబట్టి ‘జైలర్ 2’ పైన భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. ఈ రెండింటి తర్వాత వెంకట్ ప్రభు కథతో మెప్పిస్తే సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయనే మాట వినిపిస్తోంది. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది వేచి చూడాలి.