దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్కీ భాస్కర్’ మూవీ అక్టోబర్ 31న పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. పీరియాడికల్ డ్రామాగా వస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ ఇంప్రెసివ్ గా అనిపించింది. ఇంటరెస్టింగ్ డ్రామాతో ఈ మూవీ కథాశం ఉండబోతోందని అనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు. ఇందులో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘లక్కీ భాస్కర్’ మూవీలో అస్సలు చిన్న మిస్టేక్స్ కూడా ఎంచలేరని అన్నారు. ఎవరైనా మూవీలో పొరపాట్లు ఫైండ్ అవుట్ చేసి చెబితే వారికి పెద్ద పార్టీ ఇస్తానని ఛాలెంజ్ చేశారు. ఈ మూవీ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని అన్నారు.
సినిమా చూసిన తర్వాత ఎవరైనా తప్పులని చూపించగలిగితే కచ్చితంగా వారికి పార్టీ ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా ఫోటోలు కూడా దిగుతానని నాగవంశీ కాన్ఫిడెంట్ గా చెప్పారు. గతంలో ‘మ్యాడ్’ మూవీ విషయంలో కూడా నిర్మాత నాగవంశీ ఇలాంటి ఛాలెంజ్ చేశారు. ‘మ్యాడ్’ మూవీ చూసిన తర్వాత ఎవరైనా నచ్చలేదు అంటే డబ్బు వాపస్ ఇస్తానని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరు కచ్చితంగా నవ్వుతారని అన్నారు. ఆయన ఛాలెంజ్ చేసినట్లుగానే సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది.
ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ మూవీ విషయంలో కూడా నాగవంశీ మరోసారి ఛాలెంజ్ చేయడం విశేషం. ఆయన ఛాలెంజ్ ని జర్నలిస్టులు అలాగే ఆడియన్స్ స్వీకరించి తప్పులని ఎత్తి చూపిస్తారా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటే సీతారామం తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో చేస్తోన్న సినిమా ఇదే కావడంతో అందరికి మూవీ పైన ప్రత్యేక ఆసక్తి ఉంది. ట్రైలర్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోన్న నేపథ్యంలో పబ్లిక్ లో సినిమాపై కొంత హైప్ క్రియేట్ అయ్యింది.
ఇక ‘సార్’ మూవీతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ సారి కంప్లీట్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేశాడు. బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంలో.. జరిగే మనీ గోల్ మాల్ ని ‘లక్కీ భాస్కర్’ లో చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆయన ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందనేది వేచి చూడాలి.