మ‌నోహ‌రి.. కాబోయే పెళ్లి కూతురులా..!

బుద్దిగా ముద్దొచ్చేస్తోంది.. లుక్కులో సాంప్ర‌దాయం ఉట్టిప‌డుతోంది. కోక ర‌వికెలో ఎంతో ఒద్దిక‌గా అలా కుర్చీలో కూచుని అందంగా వేచి చూస్తోంది. ఈ రూపం.. ఆ ట్రెడిష‌న్ స్ట‌న్న‌ర్‌.. మునుప‌టి క‌ళ్ల‌తో కాదు ఈరోజు ప్ర‌త్యేకంగా చూడాలి నోరాని. ఇంత‌లోనే ఎంత‌గా మారిపోయింది ఈ మొరాక‌న్ బ్యూటీ? `మ‌నోహ‌రీ….` అని తెలుగు లిరిసిస్ట్ పాట రాసాడంటే.. ఈ అందాన్ని చూసే క‌దా!

భార‌త‌దేశంలో అరుదైన ప్ర‌తిభావంత‌మైన‌ డ్యాన్సింగ్ క్వీన్స్ లో నోరా ఒక‌రు. బుల్లితెర రియాల‌టీ షోల‌లో మ‌లైకాతో పాటు పోటాపోటీగా దూసుకెళుతున్న జ‌డ్జి నోరా. ఇటీవ‌లే వ‌న్ టేక్ సాంగ్ తో యూట్యూబ్ లో దుమారం రేపింది నోరా. ఈ డ్యాన్సింగ్ క్వీన్ ఐఫా 2024 ఉత్స‌వాల్లో స్టేజ్ బ్యాక్ త‌న స్ట్ర‌గుల్ గురించి కూడా ఓపెనైంది. క‌ఠిన‌మైన‌ యాంకిల్ పెయిన్ ని సైతం లెక్క చేయ‌క ఉత్స‌వాల్లో డ్యాన్సులు చేయాల్సి వ‌చ్చింద‌ని కూడా నోరా తెలిపింది.

మ‌రోవైపు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన `మ‌ట్కా`లో నోరా ప్ర‌ద‌ర్శ‌న క‌ట్టి ప‌డేసింద‌న్న‌ టాక్ ఉంది. మ‌ట్కాలో ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌లో నోరా న‌ట‌న‌కు క్రిటిక్స్ మంచి మార్కులే వేసారు. ఇలాంటి స‌మయంలో నోరా ఫ‌తేహి ఫోటోషూట్లు ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. మెగా హీరో సినిమాలో నోరా న‌ట‌న‌కు ఫ్యాన్స్ ఫిదా అవ్వ‌డంతో త‌న సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్ లో గ్రాఫ్ పెరుగుతోంది. నోరా `మ‌ట్కా` త‌ర్వాతా తెలుగులో మ‌రిన్ని సినిమాల్లో న‌టించేందుకు మేక‌ర్స్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంద‌ని స‌మాచారం. నోరా లేటెస్ట్ ట్రెడిష‌న‌ల్ లుక్ చూశాక‌.. మ‌నోహ‌రి.. కాబోయే పెళ్లి కూతురులా..! ఉంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయ్.