తెలుగు భాషను ఖూనీ చేస్తూ ప్రమాణస్వీకారం..! ఎవరు.. ఎక్కడంటే..

ఇటివల జరిగిన ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కార్పొరేషన్లకు సంబంధించి మేయర్ల ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆయ మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. తిరుపతి కార్పొరేషన్ లో జరిగిన ప్రమాణ స్వీకారంలో ఓ కార్పొరేటర్ చేసిన ప్రమాణ స్వీకారంలో తీవ్ర తప్పులు దొర్లాయి. ఓ దశలో అధికారులు చెప్తున్న దానికీ ఆమె చెప్పిన దానికీ పొంతన లేకుండా పోయింది.

నగరంలోని 29వ డివిజన్ నుంచి గెలిచిన ఆదిలక్ష్మితో అందరిలానే ప్రమాణ స్వీకారం చేయించారు అధికారులు. అయితే.. అధికారులు చెప్తున్న మాటలకు భిన్నంగా చెప్పిన ఆదిలక్ష్మి తప్పులు మీద తప్పులు చదువారు. తెలుగు భాషలో కూడా ఆమె సరిగా చదవలేకపోయారు. ఓదశలో ఆమె మాట్లాడుతున్న మాటలు ఎవరకీ అర్థం కాలేదు. మొత్తానికి అధికారులు ‘చదివారు’ అనిపించేలా ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు.