ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అదే సినిమాతో అభినయ్ కృష్ణ పరిచయం అయ్యాడు. ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకోగా అభినయ్ కృష్ణ అలియాస్ అభి ప్రస్తుతం జబర్దస్త్ లో సందడి చేస్తున్నాడు. పెద్ద ఎత్తున అభి స్కిట్ లకు అభిమానులు ఉంటారు. అభివల్ల ఎంతో మంది జబర్దస్త్ లో గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా రామ్ ప్రసాద్ తో కలిసి అభి ఈటీవీలో ప్రసారం అయిన అలీతో సరదాగా టాక్ షో లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా అభి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.
ప్రభాస్ స్టార్ గా ఎదిగితే తాను మాత్రం ఉద్యోగం చేసుకుంటూ నటుడిగా కెరీర్ లో మెల్లగా ముందడుగు వేసుకుంటూ వచ్చానంటూ చెప్పుకొచ్చాడు. ఒక నిర్మాతకు డబ్బు ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డానంటూ అభి చెప్పుకొచ్చాడు. ఇక ఒక కార్యక్రమంలో ఏయన్నార్ గారి చేతుల మీదుగా సన్మానం అందుకున్నాను. ఆ సమయంలో ఏయన్నార్ గారి కాళ్లకు నమస్కారం చేస్తూ మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకోవాలని ఆశీర్వదించమని కోరాను. ఆ సమయంలో ఆయన కాళ్ల మీద పడితే మంచి నటులు అయిపోరు. కష్టపడాలంటూ సూచించారు. ఈ షో వచ్చే సోమవారం టెలికాస్ట్ అవ్వబోతుంది.