ఆచార్య క్రేజీ అప్డేట్ రివీల్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఆచార్య ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. తొలి 24 గంటల్లోనే 20 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని రికార్డులు సృష్టించింది. ఆచార్యలో రామ్ చరణ్ పాత్ర కూడా ప్రధానంగా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది. ఈ సినిమాలో సిద్ధగా కనిపించనున్నాడు రామ్ చరణ్.

సిద్ధ మిషన్ ను ఆచార్యగా వచ్చిన చిరంజీవి పూర్తి చేయడం ప్రధాన కథగా తెలుస్తోంది. ఇక రామ్ చరణ్, చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధాన ప్లస్ పాయింట్ గా చిత్రానికి నిలుస్తాయని తెలుస్తోంది. వీరిద్దరి సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ లోనే వచ్చేస్తాయని సమాచారం.

ప్రీఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్ కచ్చితంగా మెగా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తోంది. అయితే ఇవి ఎంత వరకూ నిజమో తెలియాలంటే చిత్ర విడుదల దాకా ఎదురు చూడక తప్పదు.