అబ్బాయికి జన్మనిచ్చిన ‘నువ్వునేను’ హీరోయిన్‌

ఉదయ్ కిరణ్‌ హీరోగా నటించిన వచ్చి సూపర్‌ హిట్ అయిన ‘నువ్వు నేను’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అనిత అబ్బాయికి జన్మనిచ్చింది. కొన్నాళ్ల క్రితం రోహిత్ రెడ్డిని వివాహం చేసుకున్న అనిత ఇటీవల ముంబయిలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో అబ్బాయికి జన్మనిచ్చినట్లుగా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది. ఆమెకు అభిమానులు మరియు సన్నిహితులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. డెలవరీ తర్వాత అబ్బాయి మరియు తల్లి ఇద్దరు కూడా సేఫ్‌ గా ఉన్నట్లుగా రోహిత్‌ రెడ్డి సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు.

అనిత తెలుగులో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన తర్వాత ఉత్తరాదికి వెళ్లింది. అక్కడ మంచి సినిమాలతో పాటు బుల్లి తెరపై కనిపించింది. హిందీ సీరియల్స్ ద్వారా నార్త్ ఇండియన్స్ కు బాగా చేరు అయిన అనిత కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు వ్యక్తి అయిన రోహిత్ రెడ్డిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరు ముంబయిలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు వీరికి అబ్బాయి పుట్టడంతో వారి ఆనందం రెట్టింపు అయ్యింది. అనిత ఫొటోలను ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్‌ ఏక్తా కపూర్‌ షేర్‌ చేశారు.