తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో ఆ మాటకు వస్తే అన్ని రంగాల్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని సీనియర్ నటి అన్నపూర్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు అనేది ఒకే వైపు నుండి జరుగదు. రెండు వైపుల నుండి జరిగే అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీ లో కొందరు అవకాశాల కోసం తప్పు చేసేందుకు ఒప్పుకుంటున్నారనే అభిప్రాయంను అన్నపూర్ణ వ్యక్తం చేశారు.
ఇతర రంగాల్లో మాత్రం వెంటనే దాన్ని బయట పెట్టడం లేదంటే నో చెప్పడం చేస్తున్నారు. కాని ఇండస్ట్రీ వారు మాత్రం కొన్ని సార్లు నో చెప్పలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఇరుక్కు పోతున్నారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. కాస్టింగ్ కౌచ్ కు గురి కాకుండా ఉండాలంటే ఎవరైనా కమిట్ మెంట్ అడిగితే వెంటనే బయటకు చెప్పాలి. అలా చెప్పినప్పుడు మళ్లీ కమిట్ మెంట్ అడిగేందుకు భయపడటంతో పాటు ఇతరులు కూడా కాస్త జాగ్రత్తగా ఆడవారితో గౌరవంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఆమె అన్నారు.