తెలుగు బుల్లి తెర మరియు వెండి తెర ప్రేక్షకులకు జ్యోతి సుపరిచితురాలు అనడంలో సందేహం లేదు. ఈమె ఈమద్య కాలంలో సినిమాల్లు ఆఫర్లు దక్కించుకోలేక పోతుంది. కాని ఈమె బుల్లి తెరపై సందడి చేస్తూనే ఉంది. తెలుగులో ఈమె అమ్మడు గతంలో నటించిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి కనుక ఇంకా గుర్తింపును దక్కించుకుంది. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపర్చింది.
ఇంటర్వ్యూలో యాంకర్ మీరు గతంలో ప్రేమలో పడ్డారా డేట్ కు వెళ్లారా అంటూ ప్రశ్నించగా లేదు అంది. గతంలో మీరు డేట్ కు వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి కదా అంటూ ప్రశ్నించగా మరి అతడు ఎవరో మీరే చెప్పండి నాకు తెలియదు అంది. ఇంతకు ముందు ఎప్పుడు డేట్ కు వెళ్లలేదు కాని ఇప్పుడు డేట్ కు వెళ్లాలని ఉంది. జీవితంలో విజయాన్ని సాధించిన వ్యక్తి మంచి వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలనే ఆశతో ఉన్నట్లుగా కూడా ఈమె చెప్పుకొచ్చింది.