మా ఎన్నికలు ఏకగ్రీవంలో తప్పేం లేదు

మా ఎన్నికల్లో ఈసారి తాను పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తాను అనే నమ్మకంను ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌ వ్యక్తం చేశాడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను ఈసారి పోటీలో ఉండటం లేదు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తాను తప్పుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు. ఇక ఎవరికి మీ మద్దతు అన్నట్లుగా ప్రశ్నించగా ప్రస్తుతం తాను అధ్యక్షుడిగా ఉన్నాను. కనుక నేను నా మద్దతు విషయంలో ఇప్పుడు స్పష్టత ఇవ్వలేను అన్నాడు.

ఇక నాగాబాబు ఆ మద్య ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగితే పీక నొక్కినట్లు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను నరేష్‌ తప్పుబట్టారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఏకగ్రీవం కోరుకుంటున్నారు. ఇందులో తప్పేం లేదు. సీనియర్‌ లు పెద్దలు కలిసి ఏకగ్రీవం చేస్తే బాగుంటుందనే అభిప్రాయంను వ్యక్తం చేశాడు. మా ఎన్నికల పోటీల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తన సహకారం ఉంటుందని అన్నారు.