షోకాజ్‌ నోటీసులు.. హేమ పోటీకి నిలిచేనా?

మా నిధులను అధ్యక్షుడు నరేష్‌ దుర్వినియోగం చేశాడంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన హేమ రికార్డింగ్‌ ఒకటి బయట పడింది. అందులో హేమ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపుతున్నాయి. మా ప్రెసిడెంట్‌ రేసులో ఉన్న హేమ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలిచాయి. మా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆమె ప్రస్తుత అధ్యక్షుడు నిధులను మింగేశాడు అంటూ ఆమె ఆరోపించింది. మా ప్రెసిడెంట్ నరేష్‌ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాడు. నటి హేమ విషయంలో నరేష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

హేమ వ్యాఖ్యలపై క్రమ శిక్షణ సంఘంకు ఫిర్యాదు ఇచ్చిన నరేష్‌ ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. దాంతో క్రమ శిక్షణ సంఘం హేమకు షోకాజ్ నోటీసును ఇవ్వడం జరిగింది. షో కాజ్ నోటీసుతో హేమ వచ్చే మా ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతుందేమో అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరో వైపు ఎన్నికలను వెంటనే నిర్వహించాలంటూ చిరంజీవి స్వయంగా క్రమ శిక్షణ సంఘంకు లేఖ రాయడం జరిగింది. మా ఎన్నికలు ఆలస్యం అయినా కొద్ది వివాదాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.