తేజూ యాక్సిడెంట్ : నరేష్ వ్యాఖ్యలపై విమర్శలు

మెగా సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆయన ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతి త్వరలోనే తేజూ కోలుకుంటాడు అంటూ కుటుంబ సభ్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది కూడా చెబుతున్నారు. ఈ సమయంలో తేజూ త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటూ కొందరు వీడియో బైట్స్ విడుదల చేస్తూ ఉంటే కొందరు సోషల్‌ మీడియా ద్వారా స్పందిస్తూ ఉన్నారు. నరేష్‌ మాట్లాడుతూ తేజూ మా ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. జాగ్రత్తగా వెళ్లమని చెబుతూనే ఉన్నాను వెళ్లి పోయారు అంటూ నరేష్‌ వీడియో బైట్ ను విడుదల చేయడం జరిగింది.

ఆ వీడియో బైట్‌ లో నరేష్‌ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తెర లేపుతున్నాయి. బండ్ల గణేష్‌ ట్విట్టర్ లో పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్ గా నరేష్ ను కౌంట్‌ చేసి విమర్శలు చేయడం జరిగింది. ఆ తర్వాత హీరో శ్రీకాంత్‌ కూడా నరేష్ గారి వ్యాఖ్యలు సబబు గా లేవు అంటూ నేరుగా పేరు పెట్టి విమర్శించాడు. ఇలాంటి సమయంలో మనం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చేలా మాట్లాడాలి. అంతే తప్ప వారికి ఆందోళన కలిగించవద్దని శ్రీకాంత్‌ సూచించాడు. విమర్శల నేపథ్యంలో నరేష్‌ స్పందిస్తూ తన ఉద్దేశ్యం అది కాదంటూ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశాడు.