సినీ నటిని మోసం చేసిన పోలీస్

తమిళ నటి రాధ విషయం సినిమా స్టోరీని తలపించే సంఘటన జరిగింది. నటిగా కొనసాగుతున్న రాధా కు గతంలోనే పెళ్లి అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల భర్త నుండి విడిపోయిన ఆమె తల్లి మరియు కొడుకుతో జీవనం సాగిస్తుంది. ఆ సమయంలోనే ఎస్‌ ఐ వసంత్ రాజ్ తో పరిచయం ఏర్పడింది. ఒక సినిమా షూటింగ్‌ సందర్బంగా వీరిద్దరి మద్య మాటలు కలిశాయి. ఆ తర్వాత ఇద్దరు ఒకరితో ఒకరు సన్నిహిత్యం పెంచుకున్నారు. ఇద్దరి మద్య శారీరక సంబంధం కూడా ఏర్పడిందట.

వసంతరాజ్‌ కు అప్పటికే పెళ్లి అయినా కూడా రాధతో సహజీవనం సాగిస్తూ వచ్చాడు. ఇటీవల రాధా తన కొడుకు తండ్రి పేరును వసంతరాజుగా పేర్కొనడం జరిగింది. కొన్ని సర్టిపికెట్ ల్లో వసంతరాజును తండ్రిగా పేర్కొనడంతో అతడికి కోపం వచ్చింది. దాంతో రాధాకు దూరంగా ఉంటున్నాడు. ఆ కారణంగా రాధ పోలీసులను ఆశ్రయించింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించిన వసంతరాజు ఇప్పుడు దూరంగా ఉంటున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. వసంతరాజుకు అప్పటికే పెళ్లి అవ్వడం వల్ల పోలీసులు ఈ కేసును ఏం చేస్తారా అనేది ఆసక్తిగా మారింది.