నటుడు రవికృష్ణ పేరుతో ఫేస్‌బుక్‌ మోసం

సోషల్‌ మీడియాలో ప్రముఖుల పేర్లు చెప్పి డబ్బులు వసూళ్లు చేయడం ఈమద్య కాలంలో చాలా కామన్ అయ్యింది. అమాయకులను పసిగట్టి వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ పంపి ఫేస్‌ బుక్‌ ద్వారా ఫేక్‌ అకౌంట్ గాళ్లు ఆ తర్వాత డబ్బులు వసూళ్లు చేయడం మొదలు పెడతారు. సీరియస్ ఆర్టిస్ట్‌ మరియు సినిమాల్లో కూడా నటిస్తూ బిగ్ బాస్ తో మంచి గుర్తింపు దక్కించుకున్న రవికృష్ణ పేరుతో ఒక ఫేస్ బుక్‌ అకౌంట్‌ను ఓపెన్‌ చేయడం జరిగింది. ఆ అకౌంట్ ద్వారా చాలా మందికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ లు పంపించి తద్వార కొందరు అమ్మాయిలను మోసం చేయడం జరుగుతుంది.

పోలీసు కేసు నమోదు అవ్వడంతో ఎంక్వౌరీ చేయగా వైజాగ్ కు చెందిన జంబాడ లక్ష్మీ వర ప్రసాద్‌ అనే వ్యక్తి రవి కృష్ణ పేరుతో ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ ను క్రియేట్‌ చేసి దుండిగల్‌ కు చెందిన అమ్మాయికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించాడు. ఆమె తో పరిచయం ఏర్పడిన తర్వాత ప్రైవేట్‌ ఫొటోలు పంపించాలంటూ కోరడంతో ఆమె పంపించింది. ఆ తర్వాత వాటితో బ్లాక్ మెయిల్‌ చేయడం మొదలు పెట్టాడు. అలా 2.20 లక్షల వరకు వసూళ్లు చేశాడు. ఇంకా కావాలంటూ డిమాండ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి అకౌంట్‌ ను బ్లాక్‌ చేశారు.