తెలుగులో పలు సినిమాల్లో నటించి సంజన గర్లానీ పెద్దగా సక్సెస్ లను దక్కించుకోలేక పోయింది. ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు ప్రయత్నాలు చేసింది. కాని అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా పెద్దగా ఫలితాలను రాబట్టుకోలేక పోయింది. ఈ సమయంలోనే బెంగళూరు డ్రగ్స్ వ్యవహారంలో ఈమె ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా మూడు నెలల పాటు ఈమె జైలులోనే ఉంది. పలు సార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసింది. చివరకు బెయిల్ మంజూరు అవ్వడంతో బయటకు వచ్చింది.
జైలు నుండి వచ్చిన తర్వాత సంజన పెద్దగా సోషల్ మీడియాలో కనిపించలేదు. హఠాత్తుగా సంజన పెళ్లి చేసుకుందనే వార్తలు మీడియాలో ప్రత్యక్ష్యం అయ్యాయి. సంజన పెళ్లి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. ఆమె కర్ణాటకకు చెందిన డాక్టర్ పాషా ను వివాహం చేసుకున్నట్లుగా కన్నడ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వీరిది ప్రేమ వివాహం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది. ఈ విషయమై సంజన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.