తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 సందడి మొదలు అయ్యింది. వచ్చే నెలలో ఈ సీజన్ ను మొదలు పెట్టబోతున్నారు. తాజాగా సీజన్ కు సంబంధించిన లోగోను విడుదల చేశారు. ఈ సీజన్ లో ఉండబోతున్నది ఎవరు అనే చర్చ మొదలు అయ్యింది. ప్రతి సీజన్ లో కూడా ఒక సీనియర్ నటి ఉంటున్నారు. హేమ మరియు కరాటే కళ్యాణి లు గత సీజన్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 లోకి సీనియర్ నటి సురేఖ వాణి రాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమెను బిగ్‌బాస్ టీమ్ సంప్రదించారట.
తాజాగా ఆమె బిగ్ బాస్ లో ఎంట్రీ ఇస్తున్నారా అంటూ ప్రశ్నించగా లేదు నాకు అలాంటి ఆలోచన లేదు.. ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చింది. అంతలోనే ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది. ఫేస్ న్యూస్ అంటూ సమాధానం ఇచ్చి మళ్లీ డిలీట్ చేయడానికి కారణం ఏంటీ అంటున్నారు. ఇంతకు సురేఖ వాణి బిగ్ బాస్ సీజన్ 5 లో కనిపించబోతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ లో సురేఖ వాణి ఉంటే మాత్రం మంచి ఎంటర్ టైన్ మెంట్ ఖాయం అంటూ అభిమానులు అంటున్నారు. ఆమె ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు.