కన్నడ సినీ పరిశ్రమకు చెందిన డ్రగ్స్ కేసుతో యంగ్ హీరో తనీష్ కు సంబంధం ఉన్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ కేసు విషయమై బెంగళూరుకు వచ్చి విచారణకు హాజరు అవ్వాల్సిందిగా నోటీసులు పంపించారు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగిన నేపథ్యంలో మళ్లీ తనీష్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు అంటూ ఆయన సన్నిహితులు కూడా బాధ పడ్డారు. కాని అసలు విషయం ఏంటీ అంటే ఆ డ్రగ్స్ కేసుకు తనీష్ కు అస్సలు సంబంధం లేదట. తనీష్ మరోసారి ఆ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను విడుదల చేశాడు.
బెంగళూరు కు చెందిన ఒక నిర్మాతతో పరిచయం ఉన్న మాట వాస్తవం. రెండేళ్ల క్రితం అవకాశం కోసం ఆయన్ను కలిశాను. ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆయనతో పరిచయం ఉండటం వల్ల నాకు డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎలాంటి స మాచారం అయినా ఉంటే ఇవ్వండి అని మాత్రమే నాకు నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ కేసుతో మీకు సంబంధం ఉంది విచారణకు హాజరు అవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొనలేదు. మీడియాలో వచ్చిన కథనాల కారణంగా నా కుటుంబ సభ్యులు ఎంతగా ఇబ్బంది పడ్డారో నాకు మాత్రమే తెలుసు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దయచేసి ఇలాంటి వార్తలను నిజ నిర్థారణ చేసుకున్న తర్వాత కాని ప్రచారం చేయాలని కోరాడు.