ఆసుపత్రిలో ఉన్న భర్త కోసం రెండు నెలల చిన్నారిని వదిలిన నటుడి భార్య


టీవీ నటుడు అనిరుధ్ దవే కరోనాతో బాధపడుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బోపాల్‌ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఒంటరిగా అక్కడ ఉండటంతో భార్య శుభి అహుజా ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఆసుపత్రిలో కరోనాతో పోరాటం చేస్తున్నాడు. ఈ సమయంలో ఆయన ఒంటరిగా ఉండటం నాకు బాధగా ఉంది. అందుకే ఆయన వద్దకు వెళ్లాలని అనుకుంటున్నటులగా చెప్పుకొచ్చింది.

అనిరుధ్‌ దవే వద్దకు వెళ్లేందుకు శుభికి రెండు నెలల పాప ఉంది. ఆ పాపకు తన అవసరం ఉంటుంది. కనుక పాపను వదిలి పెట్టి వెళ్లలేక ఇన్ని రోజులు ఉండి పోయిన శుభి ఇక తప్పని పరిస్థితుల్లో వెళ్లాలనే నిర్ణయానికి వచ్చిందట. ఇంట్లో పాపను వదిలేసి భర్త వద్దకు వెళ్తున్నట్లుగా సోషల్‌ మీడియాలో చాలా ఎమోషనల్ గా పోస్ట్‌ పెట్టింది. నా భర్త మరియు పాప క్షేమం కోసం స్నేహితులు ప్రార్థనలు చేయాలంటూ ఆమె కోరింది. ఆమె పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.