ఫ్లాష్ బ్యాక్: ఆ సినిమాతో స‌ర్వం కోల్పోయిన రోజా

రోజా అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప్ర‌స్తుతం ఆమె ఏపీలో ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ చైర్మ‌న్‌గా కొన‌సాగుతున్నారు. ఇంకోవైపు ఆమెకు ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంది. దాంతో పాటు ఆమె ఈటీవీలో జ‌బ‌ర్ద‌స్త్ షో జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇంకోవైపు త‌ర‌చూ జ‌రిగే ప్రోగ్రామ్ ల‌లో కూడా పాల్గొంటున్నారు. ఇదిలా ఉండ‌గా ఆమె డైరెక్ట‌ర్ సెల్వ‌మ‌ణిని ల‌వ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి అంద‌రికీ తెలిసిందే.

అయితే ఒకానొక ద‌శ‌లో రోజా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించి తీవ్ర అప్పుల్లో కూరుకుపోయారంట‌. సుమ‌న్ హీరోగా రోజా హీరోయిన్‌గా సెల్వ‌మ‌ణి ద‌ర్శ‌క‌త్వంలో 1994లో అతిర‌థి ప‌డై అనే మూవీని తెర‌కెక్కించారు. దీన్నే తెలుగులో స‌మ‌రంగా విడుద‌ల చేశారు. ఈ మూవీకి రోజానే నిర్మాత‌గా వ్య‌వ‌హరించారు. కాకాపోతే ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడ‌లేదు. దీంతో స‌ర్వం కోల్పోయారంట‌. తాను సంపాదించుకున్న‌దంతా న‌ష్ట‌పోయార‌ని తెలుస్తోంది. కాగా మ‌ళ్లీ సినిమాల్లో న‌టించి ఆ అప్పుల నుంచి బ‌య‌ట‌ప‌డ్డారంట రోజా. అయితే ఆ అప్పుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ఆమెకు చాలా కాలం ప‌ట్టిందంట‌. ఇక అప్ప‌టి నుంచి ఆమె మ‌ళ్లీ నిర్మాత‌గా వ్య‌వహ‌రించ‌డానికి పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూపించ‌ట్లేదు.