‘జవాన్’ సక్సెస్ తో నయనతార రేంజ్ బాలీవుడ్ కి తాకింది. ఇప్పుడు అక్కడ స్టార్ హీరోలు సైతం నయన్ తో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అమ్మడు పారితోషికం కూడా భారీగా పెంచినట్లు వార్తలొస్తు న్నాయి. సల్మాన్ ఖాన్..అమీర్ ఖాన్…హృతిక్ రోషన్ లాంటి స్టార్స్ సరసన కనిపించిందంటే? ఇక నయన్ ని పట్టుకోవడం దాదాపు అసాధ్యమే. బాలీవుడ్ లో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా! నయన్ స్థానం ప్రత్యేకంగా ఉంటుంది.
అమెకి ఆమె పోటీ తప్ప ఇతరులు పోటీ కాదనేలా దూసుకుపోతుంది. టాలీవుడ్ లోనే చాలా రేర్ గానే కమిట్ అవుతుందంటే? సౌత్ లో నయనతార డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో గెస్ చేయోచ్చు. అయితే కోలీవుడ్ లో మాత్రం తూచ తప్పకుండా సినిమాలు చేస్తోంది. కమర్శియల్ చిత్రాలతో పాటు లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో లారెన్స్ సరసన ఓ సినిమాకి సంతకం చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
రత్న కుమార్ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కనుంది. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ నుంచి నయనతార ఎగ్జిట్ అయినట్లు సమాచారం. తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా డేట్లు సర్దుబాటు చేయడం కుదరక తప్పుకు న్నట్లు వినిపిస్తుంది. అలాగే నిర్మాత నుంచి తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగిచ్చేసిందిట. తమ బ్యానర్లో ఎలాంటి సినిమా కమిట్ అవ్వలేదని వాళ్ల నుంచి మాట అడిగిందిట.
అందుకు వారు కూడా అంగీకారం చెప్పినట్లు సమాచారం. మరి నయనతార నిజంగా డేట్లు సర్దుబాటు చేయలేక తప్పుకుందా? ఇంకేదైనా కారణం ఉందా? అంటే మరో బలమైన రీజన్ కూడా వినిపిస్తోంది. ఇప్పుడు తాను ఉన్న పోజిషన్ లో లారెన్స్ తో సినిమా చేయడం కరెక్ట్ కాదని నయన్ కి బాగా సన్నిహితంగా ఉండేవారు నూరుపోయడంతోనే ఆమె ఎగ్జిట్ అయినట్లు కోలీవుడ్ మీడియాలో కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. అలాకాకుంటే హీరో తెలియకుండానే అడ్వాన్స్ తీసుకుంటుందా? తమ బ్యానర్లో సినిమా కమిట్ అవ్వలేదన్న మాట ఎందుకు తీసుకుంది? అనే వాదన వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవాలు ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది.