అడివి శేష్ కు డెంగ్యూ జ్వరం సోకిన విషయం తెల్సిందే. సెప్టెంబర్ 18న డెంగ్యూ కారణంగా బ్లడ్ ప్లేట్ లెట్స్ కౌంట్ పడిపోవడంతో నీరసించిన అడివి శేష్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. సెప్టెంబర్ 20న అడివి శేష్ పిఆర్ఓ టీమ్ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. శేష్ కోలుకుంటున్నాడని, అధికారికంగా హెల్త్ అప్డేట్స్ ఇస్తామని తెలిపారు.
ఆ తర్వాత శేష్ ఆరోగ్యం ఎలా ఉందన్న విషయంలో ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఈరోజు స్వయంగా శేష్ నుండే అప్డేట్ వచ్చింది. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చినట్లు తెలిపాడు శేష్. డెంగ్యూ తగ్గినా కూడా తనకు ఇంకా నీరసం ఉన్నట్లు తెలుస్తోంది.
రెస్ట్ తీసుకుంటూ కోలుకుంటున్నానని అడివి శేష్ ట్వీట్ చేసాడు. అడివి శేష్ ప్రస్తుతం మేజర్, హిట్ 2 చిత్రాల్లో నటిస్తున్నాడు.