ఆ జంటకు ‘ఆదిపురుష్‌’ సంగీత బాధ్యతలు

దేశ వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులతో పాటు హిందువులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఆదిపురుష్‌. రాముడి కథ నేపథ్యంలో రూపొందుతున్న ఆదిపురుష్‌ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కు సంగీతాన్ని ఎవరు అందిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఏఆర్‌ రహమాన్‌ వంటి స్టార్‌ దిగ్గజ సంగీత దర్శకుడు ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తే బాగుంటుందని అంతా భావించారు. కాని ఈ సినిమాకు సచేత్‌ – పరంపర లు సంగీతాన్ని అందించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

సచేత్‌ (టాండన్‌) మరియు పరంపరా(ఠూకూర్‌) లు ఈమద్య కాలంలో బాలీవుడ్‌ లో తెగ సందడి చేస్తున్న సంగీత దర్శకత ద్వయం. వీరిద్దరు ఓమ్‌ రౌత్‌ గత చిత్రం తానాజీ లో రెండు పాటలకు ట్యూన్స్ అందించారు. వారి పనితనం నచ్చడంతో దర్శకుడు ఓమ్‌ రౌత్ ఇప్పుడు ఆదిపురుష్‌ పూర్తి బాధ్యతలు వారికే అప్పగించాడు. సాహో సినిమాలో సైకో సయ్యాన్‌ హిందీ పాటను పాడిన సమయంలో ప్రభాస్‌ దృష్టిలో సచేత్‌ పడ్డాడు. అందుకే ఇప్పుడు ఆదిపురుష్‌ కు ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమా సంగీతం చాలా ప్రత్యేకంగా ఉండాల్సి ఉంది. మరి వీరు ఎలా ఇస్తారు అనేది చూడాలి.