‘ఆది పురుష్‌’ ఆరంభం

తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్‌ భారత సినీ అభిమానులు ఎదురు చూస్తున్న ఆది పురుష్‌ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఇప్పటికే మోషన్‌ క్యాప్చర్‌ కార్యక్రమం మొదలు పెట్టిన దర్శకుడు ఓమ్‌ రౌత్‌ తాజాగా షూటింగ్ ను కూడా ప్రారంభించాడు. ప్రస్తుతం సలార్‌ మూవీ షూటింగ్‌ లో పాల్గొంటున్న ప్రభాస్ వచ్చే వారంలో ఆదిపురుష్‌ షూటింగ్ లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారి ద్వారా సమాచరాం అందుతోంది.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్‌ రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సీత మరియు లక్ష్మణ పాత్రలో కనిపించబోతున్నది ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. నేటి నుండి షూటిగ్‌ ప్రారంభిస్తున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సినిమా విడుదల చేస్తారట. ఈ సినిమా కోసం హిందువులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామాయణంను విభిన్నంగా చూపించడంతో పాటు విజువల్ వండర్‌ గా ఈ సినిమాను తీర్చి దిద్దబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.