5 ఏళ్ల తర్వాత ఆ బయోపిక్ పై స్పష్టత వచ్చింది


2008 ఒలింపిక్స్ లో బంగారు పతకంను ఇండియాకు సాధించి పెట్టిన షూటర్ అభినవ్ బింద్రా యొక్క జీవిత చరిత్రను సినిమాగా తీసుకు రాబోతున్నట్లుగా 2017 సంవత్సరంలో బాలీవుడ్ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. ఆ సమయంలో జాతీయ స్థాయి మీడియా లో వారం రోజుల పాటు హడావుడి కనిపించింది. కానీ ఆ తర్వాత బయోపిక్ గురించి అసలు సౌండ్ లేకుండా పోయింది.

ఆ బయోపిక్ క్యాన్సిల్ అయ్యింది అంటూ కొందరు ప్రచారం చేస్తే మరి కొందరు మాత్రం వర్కౌట్ అవ్వదనే ఉద్దేశ్యంతో వదిలేశారు అంటూ మరి కొందరు ప్రచారం చేశారు. మొత్తానికి ఈ అయిదు సంవత్సరాల కాలంలో పలు సార్లు ఆ బయోపిక్ గురించి చర్చ వచ్చినా కూడా అప్పట్లో ప్రకటించిన వారు అసలు విషయం ఏంటి అనే విషయమై స్పష్టత ఇవ్వకుండా సస్పెన్స్ లో ఉంచుతూ వచ్చారు.

ఎట్టకేలకు బయోపిక్ క్యాన్సిల్ అవ్వలేదని.. ఇంకా బయోపిక్ కి సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయంటూ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఈ బయోపిక్ ని అనిల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ కపూర్ చేస్తాడంటూ అప్పట్లో అధికారికంగా ప్రకటన వచ్చింది. అభినవ్ పాత్రకు హర్షవర్థన్ సరిగ్గా సెట్ అవుతాడు అంటూ అంతా భావించారు.

మళ్లీ ఇప్పుడు హర్షవర్ధన్ ఒక ఇంటర్వ్యూలో ఆ బయోపిక్ గురించిన విషయాన్ని ప్రస్థావించిన మీడియా వారికి స్పష్టతను ఇచ్చాడు. ఒక బయోపిక్ అది కూడా ఒక అంతర్జాతీయ ఛాంపియన్ యొక్క బయోపిక్ అంటే చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి చిన్న విషయంను కూడా చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాతే స్క్రిప్ట్ లో చేర్చడం జరుగుతుంది.

ఈ కారణాల వల్లే అభినవ్ బింద్రా యొక్క బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకు వెళ్లడానికి సమయం పడుతుందని.. అతి త్వరలోనే సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు. సినిమా మొదలు పెట్టిన తర్వాత గ్యాప్ ఇవ్వకుండా పూర్తి చేసి 2024 లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తాం అన్నట్లుగా హర్షవర్థన్ కపూర్ అన్నాడు.


Recent Random Post: