అలీ బాల నటుడిగా తెరంగేట్రం చేసి ఎన్నో సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత హీరోగా నటించిన అలీ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే. టాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న అలీ ఇప్పుడు తన కూతురు జువేరియా మీతిని వెండి తెరకు పరిచయం చేస్తున్నాడు. లాయర్ విశ్వనాథ్ సినిమా ద్వారా జువేరియా మీతి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నట్లుగా స్వయంగా అలీ ప్రకటించాడు.
లాయర్ విశ్వనాథ్ సినిమా లో హీరోగా అలీ నటిస్తున్నాడు. ఆ సినిమా లో అలీతో జువేరియా మీతి నటించింది. 9 ఏళ్ల జువేరియా చేసిన ఈ పాత్ర సినిమాకు చాలా కీలకంగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అలీ కూడా ఇండస్ట్రీలో 8 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన కూతురు కూడా అదే వయసులో నటన ఆరంభించింది. నటనలో శిక్షణ ఏమీ లేకుండానే జువేరియా డైరెక్ట్ గా కెమెరా ముందుకు వచ్చింది. తన సినిమాను అందరు చూసి ఆశీర్వదించాలంటూ జువేరియా ముద్దు మాటలతో కోరడం అందరి దృష్టిని ఆకర్షించింది.