బిగ్ బాస్ తర్వాత అందుకే అవకాశాలు రాలేదు: అలీ రెజా

బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్లకు వచ్చే గుర్తింపు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓవర్ నైట్ స్టార్స్ అవుతుంటారు చాలా మంది. కానీ బిగ్ బాస్ లో పాల్గొన్న చాలా మందికి క్రేజ్ వచ్చినా ఆ తర్వాత అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇది అందరికీ ఓ మిస్టరీగానే మారింది.

ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు అలీ రెజా. “మేం షో నుండి బయటకు వచ్చాక అందరికీ మంచి క్రేజ్ వచ్చింది. అయితే బిగ్ బాస్ ముగిసిన నాలుగు నెలలలోగానే కరోనా వచ్చేసింది. ఆ హైప్ అంతా అలానే వేస్ట్ అయింది. మాకు బయటకు వెళ్లి ఏదైనా పని చేసుకోవాలంటే అవ్వలేదు. ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఆ తర్వాత వెంటనే బిగ్ బాస్ 4 వచ్చేసింది” అని తెలిపాడు.