అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం పుష్ప సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో బన్నీ డి గ్లామర్ పాత్రలో కనిపించబోతున్నాడు. చింపిరి జుట్టు మరియు గడ్డంతో బన్నీ లుక్ విషయంలో అభిమానులు కాస్త అసంతృప్తి తో ఉన్నా కూడా సుకుమార్ సినిమా కనుక కచ్చితంగా బాగుంటుంది అనే ఉద్దేశ్యం తో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. బన్నీ తర్వాత సినిమాలో కూడా డీ గ్లామర్ గానే కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం అల్లు అర్జున్ మరియు కొరటాల శివ ల కాంబోలో రూపొందుతున్న సినిమాలో కూడా హీరో మాస్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ ను కొరటాల కూడా డీ గ్లామర్ గానే చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. బన్నీ ని తర్వాత సినిమాలో అయిన స్టైలిష్ పాత్రలో కనిపిస్తాడేమో అనుకుంటే మళ్ళీ డీ గ్లామర్ పాత్రలోనే కనిపించబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలు ఫ్యాన్స్ కు కాస్త అసహనం కలిగిస్తుంది.