బన్నీ కాళ్లపై పదే పదే పడుతున్న అభిమానులు, కానీ ఎందుకిలా?

అల్లు అర్జున్ తాజాగా ‘చావు కబురు చల్లగా‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఆయన కాళ్లపై అభిమానులు పదే పదే పడుతుండటం విడ్డూరంగా అనిపించింది. బన్నీ ఎంట్రీ ఇచ్చే సమయంలోనే చాలా మంది సెక్యూరిటీగా ఉన్నా కూడా అభిమాని ఒకరు కాళ్ల మీద పడేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత కూర్చున్న సమయంలో కూడా బన్నీ వద్దకు వెళ్లేందుకు కొందరు ప్రయత్నించి ఆయన కాళ్లు మొక్కే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత స్టేజ్ పై మాట్లాడుతున్న సమయంలో కూడా అభిమాని దూసుకు వచ్చారు.

అంత మంది సెక్యూరిటీ బన్నీని కాపాడుకుంటూ ఉన్నా కూడా అభిమానులు అలా దూసుకు రావడం పలు అనుమానాలకు తావు ఇస్తుంది. సోషల్‌ మీడియాలో అభిమానులను కావాలని పంపిస్తున్నారు అంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం వీరి అభిమానం మరీ హద్దులు దాటినట్లుగా అనిపిస్తుందని అంటున్నారు. స్టేజ్ పై మాట్లాడుతున్న సమయంలో ఒక అభిమాని వచ్చి కౌగిలించుకోవడంతో బన్నీ కంగారు పడి నవ్వుతూ ఏంటయ్యా ఇది కావాలని పంపిస్తున్నారా ఇలా అన్ని ఆడియో ఫంక్షన్ లకు అంటూ ఆ అభిమాని కోరినట్లుగా ఫొటో దిగి పంపించాడు.