బన్నీ ఎక్కడా ‘తగ్గేదే లే’..! అదరగొట్టేసిన ‘పుష్ప’ టీజర్

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘పుష్ప’. టైటిల్, బన్నీ లుక్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా వీడియో ఏప్రిల్ 8 బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రిలీజ్ చేసింది. పుష్పరాజ్ గా బన్నీ లుక్ అదిరిపోయింది. అడవి నేపథ్యంలో ఎర్ర చందనం దుంగల స్మగ్లింగ్ చేసే విధానం, స్మగ్లర్లు చెట్లు కొట్టే విధానం, పోలీసులు వస్తుంటే స్మగ్లర్లు, ఊళ్లో వారు విజిల్ వేసి సిగ్నల్ ఇవ్వడం, యాక్షన్ సీన్స్.. సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

లారీ డ్రైవర్ గా బన్నీ, గ్రామీణ యువతిగా రష్మిక ఆకట్టుకున్నారు. స్మగ్లర్ గా బన్నీ రఫ్ లుక్ లో పోలీసుల నుంచి తప్పించుకోవడం, భారీ యక్షన్ దృశ్యాలు స్టఫ్ ఉన్న పాన్ ఇండియా సబ్జెక్ట్ అనిపిస్తున్నాయి. దేవిశ్రీ బ్యాక్ గ్రౌండ్ తో మ్యాజిక్కే చేశాడు. సినిమాటోగ్రఫీ.. అన్నింటికీ మించి సుకుమార్ టేకింగ్ అదిరిపోయింది. బన్నీ మాస్ లుక్ ఫ్యాన్స్ కు కిక్కు ఎక్కించేలా ఉంది. వీడియో మొత్తం మీద బన్నీ చెప్పిన ‘తగ్గేదే లే..’ అనే డైలాగ్ చూస్తుంటే.. సినిమా కూడా ఎక్కడా తగ్గేది లేదన్నట్టుగానే ఉంది.