ప్రస్తుతం అల్లు అర్జున్ ముందున్నవి ఆ రెండు ప్రాజెక్ట్స్!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. పుష్ప యాక్షన్ సీన్స్ ను ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. పుష్ప చిత్రం తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఏంటి?

ముందుగా అయితే కొరటాల శివతో సినిమా లైన్లో ఉండేది కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్ళింది. వచ్చే ఏడాది సమ్మర్ కు కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశమే లేదు. ఆర్ ఆర్ ఆర్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు కొరటాల శివ.

వచ్చే సమ్మర్ వరకూ కొరటాల కోసం బన్నీ ఎదురుచూసే అవకాశమే లేదు. ఈలోగా మరో ప్రాజెక్ట్ మొదలుపెట్టాలి. దిల్ రాజు ఐకాన్ సినిమా కచ్చితంగా చేస్తాము అంటున్నాడు కానీ బన్నీ ఈ ప్రాజెక్ట్ పై ఇంకా డిసైడ్ అవ్వలేదు. ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా ఓకే అయింది. సలార్ ను అక్టోబర్ కల్లా పూర్తి చేసి, కనీసం డిసెంబర్ కు అయినా ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తే అల్లు అర్జున్ చేసే అవకాశముంది.