అల్లు అర్జున్ దర్శకుల లిస్ట్ లో మరో ఇద్దరు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగినా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కారణంగా ఇప్పుడు హోల్డ్ లో పెట్టారు. ఇక అల్లు అర్జున్ తర్వాతి చిత్రం ఏమిటనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు కానీ ఆ ప్రాజెక్ట్ ఏడాది వెనక్కి వెళ్ళింది. వచ్చే ఏడాదికి కానీ ఈ సినిమా మొదలుపెట్టరు.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ ఉంటుందని దిల్ రాజు మరోసారి ప్రకటించాడు కానీ ఆ సినిమా మొదలవుతుందన్న నమ్మకం అల్లు అర్జున్ వర్గాల్లో లేదు. మరి అల్లు అర్జున్ తర్వాతి చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నట్లు? ప్రస్తుతం రెండు పేర్లు వినిపిస్తున్నాయి. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ బన్నీతో పనిచేయడానికి ఆసక్తి చుపిస్తున్నాడట. అలాగే అనిల్ రావిపూడి కూడా ఒక కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.