మెగా కజిన్స్ రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. వీరిద్దరి మధ్యన మనస్పర్థలు అంటూ ఎన్ని రూమర్స్ వచ్చినా కానీ అవేమీ వీరు పట్టించుకోరు. ఫ్యామిలీ గాథేరింగ్స్ లో ఎప్పుడూ తమ బాండింగ్ భయపడుతూనే ఉంటుంది.
ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా సోకిన విషయం తెల్సిందే. వచ్చిన దగ్గరనుండి హోమ్ ఐసోలేషన్ లో ఉండి కోలుకున్నాడు. ఇంకా క్వారంటైన్ లోనే ఉన్నాడు. అల్లు అర్జున్ కు ఈరోజు రామ్ చరణ్ కొన్ని కానుకలు పంపించాడు. బన్నీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు.
బన్నీ ఈ కానుకలను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. “డియర్ బన్స్, నువ్వు కోలుకున్నావని ఆశిస్తున్నాను. నీకు నా ప్రేమలు, చరణ్” అని మెసేజ్ ను పోస్ట్ చేసాడు బన్నీ.