ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ పుష్ప. ప్రస్తుతం కోవిద్ పరిస్థితుల నేపథ్యంలో సినిమా షూటింగ్ జరగకపోయినా ఈ చిత్రంపై అప్డేట్స్ మాత్రం వస్తున్నాయి. రీసెంట్ గా ఈ చిత్ర నిర్మాతలు పుష్ప రెండు భాగాలుగా వస్తోందన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసారు. అయితే ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదుట. గతేడాది నవంబర్ లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఫస్ట్ పార్ట్ మెజారిటీ షూటింగ్ పూర్తయ్యిందిట. ఒక పాట, కొన్ని సీన్స్ చిత్రీకరణ మాత్రమే మిగిలిందని తెలుస్తోంది. పుష్ప రెండు పార్ట్శ్ గా వస్తోన్న నేపథ్యంలో మొదటి భాగంలో ఎక్స్ట్రా సాంగ్ ను యాడ్ చేస్తున్నారని తెలుస్తోంది. అది ఐటమ్ సాంగ్. అయితే ఈ సాంగ్ లో ఏ హీరోయిన్ నటించేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ రెండు భాగాలూ కూడా తక్కువ వ్యవధిలోనే విడుదలవుతాయట. ఒకదాన్ని మించి మరొకటి ఉంటుందని నిర్మాతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.