బన్నీ తదుపరి సినిమా పై మరింత స్పష్టత

అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా చేసిన వెంటనే కొరటాల శివతో ఒక సినిమాను చేయాల్సి ఉంది. కాని పుష్ప ను రెండు పార్ట్‌ లుగా తీయబోతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ తో కొరటాల శివ సినిమా పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యాడు. ఆ తర్వాత కొరటాల శివ, బన్నీ సినిమా ఉంటుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా అల్లు అర్జున్ తదుపరి సినిమా మరింత ఆలస్యం అయ్యేలా ఉందని టాక్ వినిపిస్తుంది. పలువురి దర్శకుల పేర్లు వినిపిస్తున్నా బోయపాటి పేరు మాత్రమే ప్రముఖంగా పేరు వినిపిస్తుంది.

బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణ తో అఖండ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. రవితేజతో ఈయన సినిమా చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతుంది. దాంతో ఈ గ్యాప్ లో బన్నీతో సినిమా చేయాలని బోయపాటి ప్లాన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను అల్లు అర్జున్‌ కోసం స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సరైనోడు సినిమాతో మంచి సక్సెస్ ను దక్కించుకున్న వీరి కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వినయ విధేయ రామ సినిమాతో అట్టర్‌ ప్లాప్ అయినా కూడా బోయపాటితో బన్నీ సినిమా కు ఛాన్స్ ఉందంటున్నారు. అయితే అఖండ ఫలితాన్ని బట్టే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.