అభిమానం అనేది ఎప్పుడూ హద్దుల్లో ఉంటేనే బాగుంటుంది. హద్దులు మీరిన అభిమానం కచ్చితంగా చేటే చేస్తుంది. అయితే ఈ కాలంలో అభిమానం అనేది శృతి మించుతోంది. తమ ఫ్యాన్స్ ను పొగుడుకునే కంటే అవతలి హీరో ఫ్యాన్స్ ను తిట్టుకోవడమే ఎక్కువ ఉంటోంది.
ఇక ఈరోజు సోషల్ మీడియాలో టాలీవుడ్ లో ఇద్దరు టాప్ స్టార్స్ అయిన అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ల మధ్య గొడవ మొదలైంది. అయితే అది ఎక్కడ ఎలా ఎందుకు మొదలైందో కారణం తెలియదు కానీ ఒకరి ఫ్యాన్స్ మరోక హీరో ఫ్యాన్స్ పై దారుణంగా ట్రోలింగ్ చేసుకుంటున్నారు.
అసభ్యకరమైన పదజాలం, అసహ్యం వేసేలా పిక్స్ ను మార్ఫింగ్ చేసి దిగజారిపోతున్నారు. #characterlessPigNTR, #BlackmailPigNTR, InsecureFoxNTR వంటి హ్యాష్ ట్యాగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అని స్టేజ్ పై ప్రకటించుకోవడాన్ని తప్పు పడుతున్నారు. ఇలాంటి ట్రెండ్ ల వల్ల ఎవరికీ ఉపయోగం లేదు అన్నది ఎప్పటికి తెలుసుకుంటారో.