హైపర్ యాక్టీవ్ ‘పుష్పారాజ్’.. క్రేజీ అప్డేట్!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీ ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది. గతేడాది ‘అలవైకుంఠపురంలో’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. అది త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా. అందులో ఓ మధ్యతరగతి స్టైలిష్ ఎంప్లాయి క్యారెక్టర్ లో కనిపించాడు. కానీ ఈసారి స్టైలిష్ క్యారెక్టర్స్ కు బ్రేక్ ఇచ్చాడు. ఆద్యంతం ఆకట్టుకునేలా నేచురల్ రియల్ అండ్ రస్టిక్ క్యారెక్టర్ పుష్పారాజ్ గా రాబోతున్నాడు.

అయితే సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో రెడీ అవుతున్న పుష్ప మూవీ కూడా మూడోదే కావడం విశేషం. మరి ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ అందుకుంటుందా లేదా అనేది రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. కానీ ఫ్యాన్స్ ఊరుకోరు కదా. సినిమా బ్లాక్ బస్టర్ అయినట్లు పోస్టర్స్ – టీజర్స్ – ట్రైలర్స్ తోనే రచ్చ చేసేస్తారు. సినిమా చివరిదశలో ఉండగానే ఫ్యాన్స్ హవా మాములుగా లేదు. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. తనకు సంబంధించిన అన్ని విషయాలు అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటాడు. అయితే అల్లు ఫ్యాన్స్ హైపర్ యాక్టీవ్. అందుకే సినిమాకు సంబంధించి ఎలాంటి చిన్న వార్త తెలిసినా రచ్చ చేసేస్తారు.

ప్రస్తుతం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ గురించి కూడా కథనాలు వైరల్ చేసేస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ రఫ్ లుక్కులో లారీడ్రైవరుగా కనిపించనున్నాడు. ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి పుష్ప పోస్టర్లు- టీజర్ చూస్తేనే సినిమా అడవుల్లో అక్రమంగా జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుందని అర్ధమవుతుంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ మాత్రం ఇదివరకటిలా కాకుండా కంప్లీట్ డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. యంగ్ సెన్సేషన్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. జులైలో పుష్ప తదుపరి షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.