అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచి పోయిన షూటింగ్ ను పునః ప్రారంభించడంతో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించేందుకు సిద్దం అవుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సునీల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడట. పుష్ప పార్ట్ 1 లో సునీల్ పుష్ప పార్ట్ 2 లో మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
కమెడియన్ గా సుదీర్ఘమైన అనుభవం ఉన్న సునీల్ కొన్నాళ్లు హీరోగా చేశాడు. ఇప్పుడు మళ్లీ విలన్ గా చేస్తున్నాడు. ఈ సమయంలో సునీల్ ను డిస్కో రాజా సినిమాలో విలన్ గా చూపించే ప్రయత్నం చేశారు. ఆ సినిమాలో సునీల్ ఆకట్టుకోలేక పోయాడు. ఆ సినిమా ఫలితం కూడా తారు మారు అయ్యింది. అందుకే పుష్ప లో ఆయన విలన్ గా చేస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఆయన్ను పెట్టి ప్రయోగం చేస్తున్నారేమో అనిపిస్తుందని.. ఇది కాస్త రిస్క్ అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సునీల్ విలనిజంను సుకుమార్ ఏ రేంజ్ లో చూపిస్తాడు అనేది చూడాలి.