ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్పకు అనుకోని ఇబ్బంది ఎదురైంది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చాలా నెలలు షూటింగ్ కు బ్రేక్ పడిన విషయం తెల్సిందే. తాజాగా షూటింగ్ మొదలై సజావుగా సాగుతోంది అనుకునే లోగా దర్శకుడు సుకుమార్ కు డెంగ్యూ జ్వరం సోకింది.
ప్రస్తుతం సుకుమార్ దాన్నుండి దాదాపు కోలుకున్నాడు. వైద్యుల పర్యవేక్షణలో సుకుమార్ కోలుకుంటున్నాడు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను కలవరపాటుకు గురి చేసే వార్త ఇది. తాజా రిపోర్ట్స్ ప్రకారం అల్లు అర్జున్, రష్మికలతో సహా దాదాపు 20 మంది డెంగ్యూ జ్వరం బారిన పడ్డారట.
అడవిలోని దోమల కాటు వల్ల ఇది సంభవించిందని తెలుస్తోంది. ఏదేమైనా ఈ రిపోర్ట్స్ పై అధికారిక సమాచారం లేదు. అయితే అల్లు అర్జున్, రష్మికలకు డెంగ్యూ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయన్నది కొంత ఉపశమనం కలిగించే వార్త.