అల్లు అర్జున్ తుంటరి పని చెప్పి పరువు తీసేసిన అల్లు అరవింద్.!

తెలుగు ఒత్తిడి ప్లాట్ ఫామ్ అయిన ఆహాలో దూసుకెళ్తున్న షో సామ్ జామ్.. సమంత అక్కినేని హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షో కి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు స్టార్స్ వచ్చారు. న్యూ ఇయర్ సందర్భంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఇంటర్వ్యూకి అతిధిగా వచ్చారు. ఈ షో మధ్యలో జాయిన్ అయిన అల్లు అరవింద్ ని సమంత ఇప్పుడైతే అల్లు అర్జున్ డిసిప్లైన్, వెరీ ఫోకస్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్.. కానీ చిన్నప్పుడు ఇలానే ఉండేవారా? లేకపోతే తన అల్లరి చేసిన విషయాలు షేర్ చేస్కోండి అని అడగగా..

అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడంటే ఇలా ఉన్నాడు కానీ చిన్నప్పుడు బాబోయ్ మామూలు అల్లరి కాదు అన్నట్లు ఒక దండం పెట్టేసారు. ఒక విషయం చెప్తాను.. తను లెవెన్త్ క్లాస్ చదివే టైంలో ప్రిన్సిపాల్ రమ్మన్నాడని పిలుచుకొని వెళ్లాడు.. వెళ్లాను, మార్క్ లిస్ట్ ఇచ్చారు చూస్తే అన్ని 20, 25 మార్కులే ఉన్నాయి.. అవి చూసి ఇప్పుడు ప్రిన్సిపాల్ నాకు బాగా దొబ్బులు పెడతాడు అని ఫిక్స్ అయిపోయా, కానీ ఇక మీరు వెళ్ళచ్చు అనగానే షాక్.. మళ్ళీ అడగటానికి ట్రై చేసినా వెళ్ళచ్చు అన్నారు, బన్నీ కూడా ఓకే వెళదాం అనగానే వచ్చేసాం. కానీ ఆ తర్వాత ఫ్రెండ్స్ నుంచి తెలుసుకుంది ఏమిటంటే.. ముందు రోజే బన్నీ ఆ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి నీకో కూతురుంది, ఏమో నేను తనని ప్రేమించచ్చు, ప్రేమించాక ఏమైనా జరగొచ్చు అన్న రీతిలో ఒక చిన్న వార్నింగ్ ఇచ్చారు.. దానికి బయపడి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదట.. అది విని నేను షాక్ అయ్యా.. వీడు ఏమైపోతాడా అని భయపడ్డాను’ అని సరదాగా చెప్తూనే అల్లు అర్జున్ పరువంతా తీసేసాడు.

అల్లు అర్జున్ రియల్ లైఫ్ లో చాలా సరదాగా, చాలా అల్లరి చేస్తూ ఉంటాడని అందరికీ తెలిసిందే.. కానీ ఈ రేంజ్ రచ్చ చేసాడని అల్లు అరవింద్ చెప్పడం వలనే తెలుస్తుంది.