కాకినాడ పోర్ట్ లో పుష్పరాజ్ హల్చల్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా పుష్ప -1 చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతున్న సంగతి తెలిసిందే. బన్ని ఈ చిత్రంలో పుష్పరాజ్ అనే గంధపు చక్కల స్మగ్లర్ కం డ్రైవర్ గా నటిస్తున్నారు. రష్మిక మందన కథానాయిక. మైత్రి సంస్థ నిర్మిస్తోంది. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుందని సమాచారం. సుకుమార్ తాజా షెడ్యూల్ ని మారేడుమిల్లిలో ప్లాన్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ కి బ్రేక్ పడిందని తెలుస్తోంది.

మారేడుమిల్లిలో ఆగని వానలు ఇబ్బందికరంగా మారాయి. కుండపోత వర్షం పడుతుంటే అక్కడ షూట్ చేసే పరిస్థితి లేదు. దీంతో పుష్ప సినిమాకి సంబంధించి షెడ్యూల్ చేసుకున్న డేట్లు తారుమారు అయ్యాయి. ఆల్టర్నేట్ ఆలోచించిన సుక్కూ టీమ్ కాకినాడలో కీలక సన్నివేశాలు చిత్రీకరణ ప్లాన్ చేశారు.

కాకినాడ పోర్టు- మడ అడువుల దగ్గర సినిమాను తీస్తున్నారు. ఈ లోపు మారేడుమిల్లిలో వానలు ఆగితే అక్కడికి మళ్లీ యూనిట్ ని షిఫ్ట్ చేస్తారు. పుష్ప చిత్రానికి తొలి నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఆరంభం శేషాచలం అడవుల్లో లొకేషన్లు అనుకుంటే దానికి తిరుపతి వెంకన్న సామి బ్రేక్ వేశారు. అక్కడ అధికారులు అనుమతులివ్వలేదు. బ్యాంకాక్ థాయ్ లాండ్ లోని దట్టమైన అడవుల్లోకి వెళ్లాలనుకుంటే అదీ వీలుపడకుండా కరోనా మహమ్మారీ రంగ ప్రవేశం చేసింది. కేరళ అడవులు అంటూ చాలానే అనుకున్నా ఏదీ కుదరలేదు. ఆ క్రమంలోనే మారేడుమిల్లి అడవుల్లో సుకుమార్ భారీ షెడ్యూల్స్ ని ప్లాన్ చేశారు. అరకు చింతపల్లి పరిసరాల్లోనూ షెడ్యూల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వర్షాల వల్ల షూటింగ్ కి బ్రేకులు తప్పడం లేదు.