టాలీవుడ్ లో ఇప్పుడు ఏ నోట విన్నా ఒకటే మాట `పుష్ప : ది రైజ్`. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఊర మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ముత్యంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీమేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీపై దర్శకుడు సుకుమార్ కూడా భారీ అంచనాలే పెట్టుకున్నారు. `బాహుబలి` తరహాలో రెండు పార్ట్లుగా నిర్మిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ని `పుష్ప : ది రైజ్` పేరుతో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కన్నడ సోయగం రష్మిక మందన్న డీ గ్లామర్ పాత్రలో నటిస్తున్నఈ మూవీని ఐదు భాషల్లో వరల్డ్ వైడ్గా ఈ నెల 17న విడుదల చేస్తున్నారు.
ఇక రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ని స్పీడప్ చేసేసింది. త్వరలోనే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ని భారీ స్థాయిలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. బన్నీ నటించిన `అల వైకుంఠపురములో` చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు తమన్ లైవ్ ఇన్స్ట్రూమెంట్స్ తో లైవ్ పెర్పామ్ చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఈవెంట్ గురించి ఇండస్ట్రీ చాలా గొప్పగా చెప్పుకున్నారు.
అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న మేకర్స్ `పుష్ప : ది రైజ్` ప్రీ రిలీజ్ ఈవెంట్ని అంతకు మించి అనే స్థాయిలో ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ ని ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలనే ఆలోచనలో వున్నారట. అయితే ప్రభాస్ ఈ కార్యక్రమానికి వస్తాడా? లేదా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి వుంది. ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ అనే గంధపు చక్కల స్మగ్లర్గా ఓ టిపికల్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని కొన్ని లిరికల్ వీడియోలు టీజర్.. సినిమాపై అంచనాల్ని పెంచేశాయి