హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో అలరించనున్న ‘అల్లుడు అదుర్స్’


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ ”అల్లుడు అదుర్స్” ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గంజి రమేష్ కుమార్ సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గొర్రెల సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో నభా నటేష్ – అనూ ఇమాన్యుల్ హీరోయిన్స్ గా నటించారు. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల స్పీడ్ పెంచారు. ఇప్పటికే ట్రైలర్ మరియు లిరికల్ వీడియో సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈ క్రమంలో ‘అల్లుడు అదుర్స్’ మేకింగ్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

మేకింగ్ వీడియో చూస్తుంటే ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో వినోదంతో పాటు హీరో సాయి శ్రీనివాస్ మ్యాజికల్ డ్యాన్స్ స్టెప్పులతో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. షూటింగ్ మొత్తం సందడిగా జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో బెల్లంకొండ ఆర్కిటెక్ట్ గా కనిపిస్తున్నాడు. ఆయన క్యారెక్టర్ కొత్తగానూ స్టైలిష్ గానూ ఉంటుందని తెలుస్తోంది. ‘రాక్షసుడు’ వంటి సూపర్ హిట్ తర్వాత సాయి శ్రీనివాస్ నుంచి వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ప్రకాష్ రాజ్ – సోనూసూద్ లతో పాటు వెన్నెల కిషోర్ – సత్య – బ్రహ్మాజీ – సప్తగిరి తదితరులు నటించారు. ‘బిగ్ బాస్’ బ్యూటీ మోనాల్ స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా.. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.