సూపర్ స్టార్ జీ ఇదేనా మీ బాధ్యత?

మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు దక్కించుకున్న అమీర్ ఖాన్ ఈమద్య కాలంలో వరుసగా వివాదాస్పద విషయాల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. తన రెండవ భార్య కిరణ్ రావు కు విడాకులు ఇవ్వడం వల్ల వివాదాస్పదుడిగా మారిన అమీర్ ఖాన్ తాజాగా తన సినిమా షూటింగ్ కారణంగా కూడా విమర్శల పాలు అయ్యాడు. అమీర్ తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా చివరి దశ షూటింగ్ లద్దాఖ్ లోని వాఖా గ్రామంలో నిర్వహించారు. ఆ షూటింగ్ లో మన హీరో నాగచైతన్య కూడా నటించిన విషయం తెల్సిందే. ఆ ఫొటోలు మరియు వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

వాఖా గ్రామంలో లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. షూటింగ్ ముగియడంతో అక్కడ నుండి అంతా వెళ్లి పోయారు. కాని వారు మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రమే అలాగే ఉండి పోయాయి. అవి మంచి జ్ఞాపకాలు కాదు చెడు జ్ఞాపకాలు. వాఖా గ్రామంలో ఎక్కడైతే యూనిట్ సభ్యులు చిత్రీకరణ జరిపారో అక్కడ ప్రస్తుత పరిస్థితిని ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతడి వీడియోకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమా వాఖా గ్రామానికి ఈ బహుమానం ఇచ్చారు అంటూ వారు వదిలేసిన ప్లాస్టిక్ మరియు చెత్తను వీడియోలో చూపించారు. సత్యమేవ జయతే అంటూ పెద్ద స్పీచ్ లు ఇచ్చే అమీర్ ఖాన్ కనీసం తమ సినిమా వల్ల ఏర్పడిన చెత్తను తొలగించే బాధ్యత కూడా లేదా అంటూ అతడు ప్రశ్నించాడు. ఆ వీడియోకు నెటిజన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. అమీర్ ఖాన్ మాటల వరకే కాని ఆయన ఏ ఒక్క మంచి పని చేయరు అంటూ విమర్శలు గుప్పించారు. అమీర్ ఖాన్ పద్దతి పట్ల చాలా మంది చాలా విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై అమీర్ ఖాన్ స్పందన ఏంటీ అనేది చూడాలి.