రంగమ్మత్త అరాచకం చూశారా?


రంగమ్మత్త అనసూయ బుల్లితెరపై ఓ రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకుంది. జబర్దస్త్ యాంకర్గా క్రేజ్ని దక్కించుకోవడమే కాకుండా అదే క్రేజ్ తో సినమాల్లోనూ వరుస అవకాశాల్ని దక్కించుకుంటూ కెరీర్ లో దూసుకుపోతోంది. క్రేజీ చిత్రాల్లో స్టార్ హీరోలకు సమానమైన పాత్రల్లో నటిస్తూ విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంటోంది. `రంగస్థలం`లో రంగమ్మత్తగా నటించి మంచి పేరు తెచ్చుకున్న అనసూయ రీసెంట్ గా విడుదలైన `పుష్ప`లోనూ దాక్షాయణిగా మెరిసింది.

బన్నీ హీరోగా నటించిన ఈ మూవీ పార్ట్ 2లో అనసూయ విలన్గా ఫాహద్ తో కలిసి తన విశ్వరూపం చూపించబోతోందట. పార్ట్ 1 ఎండింగ్ లో సునీల్ కి చుక్కలు చూపించిన అనసూయ పార్ట్ 2లో మరింతగా రెచ్చిపోయి ప్రతీకార జ్వాలతో రగిలిపోయే దాక్షాయణిగా మరింత క్రూరంగా కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆడియన్స్ పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. `పుష్ప 2` షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది.

ఇదిలా వుంటే మాస్ మహారాజా రవితేజ నటించిన `ఖిలాడీ` చిత్రంలో రెండు పాత్రల్లో మెరిసింది. ఓ పాత్రలో చంద్రకళగా మరో పాత్రలో చాందినిగా కనిపించి సర్ ప్రైజ్ చేసింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ఓపెనింగ్స్ పరంగా మాత్రం ఫరవాలేదనిపించింది. ఈ విషయం పక్కన పెడితే.. అనసూయ బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా వరుస ఆఫర్లతో బిజీగా వుంటున్న విషయం తెలిసిందే.

ఇంత బిజీగా వున్న సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం గ్లామర్ ఫొటో షూట్ లతో తన ఇన్ స్టా గ్రామ్ ని నింపేస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది. విమర్శలకు ధీటుగా సమాధానాలిస్తూనే గ్లామర్ ఫొటోలతో నెట్టింట హల్ చల్ చేస్తోంది. సినిమాల ఎంపిక విషయంలో సెలెక్టీవ్ గా వెళుతూ క్రేజీ ప్రాజెక్ట్ లని సొంతం చేసుకుంటున్న అనసూయ తాజాగా సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసిన హాట్ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఈ వీడియోలో డార్క్ లిప్స్.. ముక్కుకి ముక్కెర.. స్లీవ్లెస్ బ్లౌజ్ధరించి అందాలు ఆరబోస్తూ… నెటిజన్ లని కవ్విస్తూ.. అనసూయ హోయలు పోయింది. అంతే కాకుండా నాటీ లుక్స్.. మేనరిజమ్స్ తో కుర్రకారుని కవ్విస్తూ నెచ్చిపోయింది. అంతేనా ఈ సెల్ఫీ వీడియోలో తన అందాలని అత్యంత క్లోజప్ యాంగిల్ లో చూపిస్తూ ఉడికించింది. యెదపై టాటూని కూడా చూపించేసింది. అనసూయ హద్దులు దాటి అందాల విందు చేసిన తాజా వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది