శ్రీముఖిని వారం రోజులు తనతో ఉండమన్న స్వామిజీ


బుల్లి తెర స్టార్ యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. ఈమద్య కాలంలో రెగ్యులర్ షో లు ఈమె ఏమీ చేయడం లేదు. కాని ఈమె చేస్తున్న షోలు ఏదో ఒక ఛానెల్‌ లో ప్రసారం అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈమె సినిమా ల్లో కూడా నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇటీవల లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటూ కాస్త అతిగా తినడం వల్ల లావు అయిన శ్రీముఖి తగ్గేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందట. బరువు తగ్గేందుకు ఇటీవల ఆమె ఒక స్వామీజీని కలిసి సలహా అడిగిందట. అప్పుడు ఆయన చెప్పిన సలహా తో శ్రీముఖి బిత్తర పోయిందట.

ఒక టీవీ ఛానెల్‌ కార్యక్రమంలో రెగ్యులర్‌ గా ఆరోగ్య పరమైన టిప్స్ చెప్పే ఆ స్వామీజీని ఒక కార్యక్రమం సందర్భంగా కలిసిన శ్రీముఖి నేను బరువు తగ్గాలంటే ఏం చేయాలి స్వామి అంటూ అడిగిందట. తిండి విషయంలో కాస్త తగ్గించాలంటే అది సాధ్యం కాదని శ్రీముఖి అన్న వెంటనే నా వెంట వారం రోజులు ఉంటే నీ బరువు తగ్గుతుందని చెప్పుకొచ్చాడట. బాబోయ్‌ వారం రోజులు మీ వెంట ఉంటే నా షో లు ఎటు పోవాలంటూ నో చెప్పిందట. అలా అయితే బరువు తగ్గడం ఎలా అంటూ స్వామీజీ అన్నాడట. మొత్తంగా బరువు తగ్గాలని బలంగా ఉన్నా ఏమాత్రం కష్టపడనంటూ శ్రీముఖి చెబుతోంది.