అఖిల్‌ అంటే ఆ హాట్ యాంకర్‌కు పిచ్చి ప్రేమ

హీరోలు అంటే సాదారణంగా అందరికి అభిమానం ఉంటుంది. ఇక అఖిల్ వంటి యంగ్‌ హీరోలు అంటే అమ్మాయిల రాకుమారుడు అన్నట్లుగా గుర్తింపు దక్కించుకుంటూ ఉంటారు. అమ్మాయిలు అమితంగా ఇష్టపడే అఖిల్‌ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సమయంలోనే ఆయన్ను హాట్ యాంకర్ విష్ణు ప్రియ ఎంతగా అభిమానిస్తుందో చాలా మందికి తెలుసు. గతంలో పలు షో ల్లో తనకు అఖిల్ పై ఉన్న ప్రేమను చెప్పింది. తాజాగా మరో సారి సుమ షో లో చెప్పింది.

సుమ హోస్టింగ్‌ చేస్తున్న స్టార్ట్‌ మ్యూజిక్ లో శ్రీముఖితో కలిసి విష్ణు ప్రియ సందడి చేసింది. ఈ అమ్మడు ప్రైజ్‌ బాక్స్ తీసుకు వచ్చేందుకు గదిలోకి వెళ్లింది. ఆ సమయంలో ఆమె ఏ లెటర్ తీసుకు వచ్చింది. విష్ణు అదే లెటర్ తీసుకుంటుందని శ్రీముఖి చెప్పింది. అన్నట్లుగానే విష్ణు ఏ బాక్స్ తీసుకు వచ్చింది. ముద్దుగుమ్మ విష్ణు ప్రియ బయటకు వచ్చిన తర్వాత సుమ ప్రశ్నించగా ఏ ఫర్‌ ఎవ్రీ థింగ్‌ అంటూ కవర్‌ చేసే ప్రయత్నం చేసింది. ఏ అంటే అక్కినేని అని కూడా వస్తుంది అని చెప్పింది. అక్కినేని వారసుడిని పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రశ్నించగా ఓకే అంది. అయితే నాగచైతన్య, సమంతకు కొడుకు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అంది. కాని చైతూకు తమ్ముడు ఉన్నాడు కదా అంటూ సిగ్గుపడుతూ విష్ణు వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి అఖిల్‌ అంతే తనకు పిచ్చి ప్రేమ అని మళ్లీ ఒకసారి చెప్పకనే చెప్పింది.